నటి జ్యోతిక పైన తమిళనాడులోని చెన్నై సిటీ కమీషనర్ కి ఫిర్యాదు అందింది.
ఆ వివరాల్లోకి వెళితే, జ్యోతిక తాజా చిత్రం నాచియార్ నిన్న విడుదలైంది, దీనికి దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు బాల. ఇక ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో దేవుడిని, దేవాలయాలని చెత్తకుప్పలతో పోల్చడం వంటి డైలాగ్స్ ఉన్నాయి అని హిందూ మక్కళ్ కట్చి నేతలు జ్యోతిక పైన సదరు చిత్ర దర్శకుడైన బాల పైన ఫిర్యాదు చేశారు.
దీనితో ఈ అంశం వివాదాస్పదమైంది. ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రం తమ మనోభావాలని దేబ్బతేసే విధంగా ఉంది అంటూ సినిమా విడుదలకి ముందు నుండే హిందూమక్కళ్ కట్చి కార్యకర్తలు ఈ సినిమా పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వారి ఫిర్యాదుని కమీషనర్ స్వీకరించి తగిన న్యాయం చేస్తాను అని తెలిపన్నట్టు తమిళనాట సమాచారం.