'ఆహ కళ్యాణం' చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన 'వాణి కపూర్' తాజాగా విడుదలైన 'వార్' చిత్రం తో అలరించింది. ఈ సినిమా హిట్ అవ్వడం తో కొత్త కొత్త ఫోటో షూట్ల తో రెచ్చి పోయిన వాణి తాజాగా ఒక ఫోటో షూట్ పుణ్యమా అని చిక్కుల్లో పడింది. ముంబై కి చెందిన ఒక వ్యక్తి వాణి కపూర్ పై తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసు పెట్టాడు. దాంతో ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కనుంది ఈ హాట్ బ్యూటీ. ఈ మధ్య పింక్ కలర్ బ్లౌస్ వేసుకుని అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ దీనికి ప్రధాన కారణం.
ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే పిచ్చిలో పడి ఏ దుస్తులు వేసుకుంటున్నామో కూడా తెలియకుండా ఇలా చిక్కుల్లో పడటం ఇది కొత్తేమి కాదు. వాణి కపూర్ వేసుకున్న పింక్ బ్లౌస్ పై 'రామ్' అని సంస్కృతం లో ఉండడం తో అది ధరించి తమ మత సాంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందంటూ కేసు లో ఇరుక్కుంది. ఇంతకుముందే ఈ పోస్ట్ తన సోషల్ మీడియా లో పెట్టినప్పుడు నెటిజన్లు ట్రోల్ చేయడం తో దాన్ని డిలీట్ చేసింది వాణి కపూర్. మరి ఇప్పుడు ఈ కేసు నుండి ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.