ఈ మధ్య తరచుగా టాలీవుడ్ లో వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులు, చీటింగ్ కేసులు ఫైల్ అవుతున్నాయి. మొదట రాజ్ తరుణ్, లావణ్య వివాదం. తరవాత మిత్రా శర్మ, హర్ష కేసు. నెక్స్ట్ జానీ మాస్టర్ వివాదం. ఇవన్నీ ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు టాలీవుడ్ యాక్టర్ శ్రీతేజ్ పై కేసు ఫైల్ అయ్యింది. శ్రీ తేజ్ పుష్ప సినిమాలో నటించాడు. పుష్ప 2 లో కూడా ఉన్నాడు. తాజాగా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో శ్రీ తేజ్ పై ఓ అమ్మాయి చీటింగ్ కేసు పెట్టింది. పెళ్ళి పేరుతో నమ్మించి, తనని మోసం చేశాడంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా, కూకట్ పల్లిలో జీరో FIR ఫైల్ చేసారు.
శ్రీ తేజ్ పై ఇదే మొదటి కేసు కాదు గతంలో కూడా శ్రీ తేజ్ పై మాదాపూర్ లో కేసు నమోదు అయ్యింది. కారణం ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోగా, అది ఆమె భర్తకి తెలిసి షాక్ తో గుండెపోటు వచ్చి మరణించాడు. దీనితో మృతుడి ఫ్యామిలీ శ్రీ తేజ్ పై కేసు ఫైల్ చేసారు. ఇపుడు ఇంకో చీటింగ్ కేసు నమోదు కావటంతో పరారీలో ఉన్నాడు శ్రీతేజ్. ఇదే కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీ తేజ్ తనని కూడా మోసం చేశాడంటూ అతని భార్య రంగంలోకి దిగి అందరికి షాక్ ఇచ్చింది.
శ్రీ తేజ్ పై కేసు ఫైల్ అయిందన్న విషయం తెలిసి తాను వచ్చినట్లు పేర్కొంది శ్రీ తేజ్ భార్య నితిష. తనకు శ్రీ తేజ్ తో పెళ్లి అయ్యిందని, 25 లక్షలు కట్నం తీసుకున్నాడని, పెళ్లి తరవాత శ్రీ తేజ్ తనను విజయవాడలోనే ఉంచాడని పేర్కొంది. హైదరాబాద్ కు తీసుకెళ్లమని అడిగితే దారుణంగా కొట్టేవాడని, తనకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని. శ్రీ తేజ రూమ్ లో ఎప్పుడూ అమ్మాయిల బట్టలు, వస్తువులు ఉండేవని స్ఫష్టం చేసింది. ఈ విషయం పై తాను శ్రీ తేజ్ ని నిలదీస్తే ఏవో చెప్పి తప్పించుకునేవాడని పేర్కొంది. డివోర్స్ కోసం అప్లై చేసానని, కానీ శ్రీ తేజ్ కోర్టుకి రావటం లేదని, మెయింటెనెన్స్ కూడా ఇవ్వటం లేదని సంచలన విషయాలు చెప్పింది నితిషా.
శ్రీ తేజ్ పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంకోవైపు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో శ్రీ తేజ్ నటించటం తో ప్రస్తుతం ఈ విషయం హైలెట్ అవుతోంది. ఆమధ్య మూవీలో బన్నీ ఫ్రెండ్ గా నటించిన కేశవ అరెస్ట్ అయ్యాడు. ఇపుడు శ్రీ తేజ్. పుష్ప సినిమా పరంగానే కాదు ఇలాంటి వివాదాల పరంగా కూడా టాప్ లో ఉంది.