అఖిల్ కంటే జైనాబ్ 9 ఏళ్ళు పెద్దదా !?

మరిన్ని వార్తలు

అక్కినేని ఇంటి నుంచి వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చైతు, శోభిత నిశ్చితార్ధం జరిగిన తరవాత నాగార్జున అప్పుడు అనౌన్స్ చేసి అందరిని సర్ప్రయిజ్ చేసారు. డిసెంబరు 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ లోగా ఇప్పుడు అఖిల్ పెళ్లి న్యూస్, ఎంగేజ్ మెంట్ విషయం అనౌన్స్ చేసారు. దీంతో అంతా షాక్ కి గురి అయ్యారు. పెద్ద కొడుకు పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న నాగ్ ఫ్యామిలీ తన చిన్న కొడుకు అఖిల్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని అనౌన్స్ చేసారు.

అఖిల్ కి జైనబ్‌ రావ్డ్జ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగినట్టు వీరి ఎంగేజ్ మెంట్ ఫొటోస్ షేర్ చేశారు నాగార్జున. ఇంతకీ అఖిల్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటి?, జైనబ్ రావ్డ్జీ ఎవరు? అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈమె కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పేరుమోసిన 'జుల్ఫీ రావ్డ్జీ' కూతురు. జైనబ్ బ్రదర్ 'జైన్ రావ్డ్జీ' ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. జైనబ్‌ ఒక ఆర్టిస్ట్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. దుబాయ్, లండన్‌లలో ఆర్టిస్ట్‌గా మంచి ఫేమ్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ఎగ్జిబిషన్స్ లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ షో జరిగింది. ప్రజంట్ ముంబైలో ఉంటున్న జైనబ్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.

జైనబ్ తండ్రి జుల్ఫీకి ఇండస్ట్రీ వ్యక్తులతో చాలా పరిచయాలు ఉన్నట్లు, తెలుస్తోంది. జగన్ బిజినెస్ సలహాదారుగా కూడా పనిచేశారని టాక్. ఏపీ ప్రభుత్వం తరఫున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి జైనబ్ తండ్రి జుల్ఫీ ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది. అంతే కాదు నాగ్ కి జుల్ఫీ కి మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న టైంలో  జైనబ్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం రాను రాను ప్రేమగా మారిందని సమాచారం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. చాలా కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షం లో వీరి నిశ్చితార్థం జరిగింది. అఖిల్ కంటే జైనబ్ 9 ఏళ్లు పెద్ద అని అంటున్నారు. ఇంకో వైపు ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, జైనబ్ కి 27 ఏళ్ళు అని కొందరు అంటున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే వీరిద్దరికి పెళ్లి అయిపోయింది అన్న రూమర్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS