చిరంజీవి - బాబి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. దీనికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇందులో రవితేజ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజకు జోడీగా కేథరిన్ థెరిస్సాని ఎంచుకున్నారు. `సరైనోడు`తో బ్రేక్ వచ్చినా, ఆ అవకాశాన్ని సరిగా వాడుకోలేదు కేథరిన్. చాలా కాలం తరవాత మళ్లీ కనిపించడం, అందులోనూ మెగా మల్టీస్టారర్‌లో అవకాశం దక్కించుకోవడం విశేషమే.
శని, ఆదివారాలు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరగబోతోంది. ఈ రెండు రోజులూ చిరంజీవి - రవితేజ - కేథరిన్‌లపై సన్నివేశాలు తెరకెక్కిస్తారని సమాచారం. చిరు - రవితేజ ఈ సినిమాలో అన్నాదమ్ముళ్లుగా కనిపిస్తారని, రవితేజది గెస్ట్ రోల్ కాదని, పూర్తి స్థాయి పాత్రే అని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరుని ఫుల్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నాడు బాబి. ఈ సినిమా ఫ్యాన్స్‌కు ఓ పండగలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.