''ఆర్ఆర్ఆర్'' అనౌన్స్ చేసినప్పటి నుంచే రాజమౌళి చాలా క్లియర్ గా వున్నారు. ''ఆర్ఆర్ఆర్ ఫాంటసీ. పూర్తిగా నా ఊహ. అల్లూరి, కొమరం భీమ్ ల బయోపిక్ కాదు' అని మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి క్లారిటీ ఇస్తూనే వున్నారు. అయితే అల్లూరి గెటప్ లో రామ్ చరణ్, కొమరం భీమ్ గెటప్ ఎన్టీఆర్ కనిపించడంతో ఎవరి తోచినట్లు వారు ఊహ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ విడుదలైయింది. కథ తెలిసింది. ఇది అల్లూరి, భీమ్ ల చరిత్ర కాదు. కానీ వారి పాత్రల ఛాయలు మాత్రం కనిపించాయి. ఎలివేషన్స్ కోసం అల్లూరి, భీమ్ పాత్రల రిఫరెన్స్ వాడుకున్నారు రాజమౌళి. అయితే వాడుకున్న విదానంపై ఇప్పుడు విమర్శలు రేగుతున్నాయి. అల్లూరిని బ్రిటిష్ సైన్యంలో పని చేయించడం, అడవి బిడ్డ కొమరం భీమ్ పాత్రతో .. జంతువులని బ్రిటిష్ సైన్యంపై ఉసిగొల్పడం.. లాంటి సినిమాటిక్ లిబర్టీలు ఓవర్ గా వున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనాలకి వినోదం పంచడానికి లిమిట్స్ దాటడం మంచి అలవాటు కాదని సూచిస్తున్నారు.
ఊహకు అవధులు ఉండకూడదనేని సినిమా వాళ్ళు నమ్మే సూత్రం. అయితే కొంతమంది మహానుభావుల పాత్రలు రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఊహకి కూడా కొంత లిమిట్స్ ఉండాలనేది విమర్శకుల మాట. రాజమౌళి ఈ విషయంలో మరోసారి స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి.