రామ్ చరణ్ మూవీలో రకుల్‌ ఔట్‌ కేథరీన్‌ ఇన్‌.?

By iQlikMovies - November 29, 2018 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

చరణ్‌ - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'వినయ విధేయ రామ' చిత్రం షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించే ముద్దుగుమ్మ ఎవరా? అనే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించనుందనీ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదనీ, ఆ ప్లేస్‌నీ హాట్‌ బ్యూటీ కేథరీన్‌ దక్కించుకుందనీ తాజా సమాచారమ్‌.

అవును కేథరీన్‌కీ, డైరెక్టర్‌ బోయపాటి శీనుకీ మంచి స్నేహం ఉంది. బోయపాటి సినిమాల్లో కేథరీన్‌కి ఈజీగా ప్లేస్‌మెంట్‌ ఉంటుంది. 'సరైనోడు' సినిమాలో కేథరీన్‌కి సెకండ్‌ హీరోయిన్‌గా ఇంపార్టెంట్‌ రోల్‌ ఇచ్చాడు బోయపాటి శీను. అలాగే 'జయ జానకి నాయకా' చిత్రంలోనూ కేథరీన్‌ ఐటెం సాంగ్‌ని అడ్జస్ట్‌ చేశాడు బోయపాటి శీను. అలాగే ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన చిందులేసే ఛాన్స్‌ కూడా కేథరీన్‌కి బోయపాటి శీను ద్వారా దక్కబోతుందని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఈ టాక్‌లో నిజమెంతో తెలీదు కానీ, ఏది ఏమైనా వినయ విధేయుని పక్కన స్పెషల్‌ సాంగ్‌లో చిందేసే ఛాన్స్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కన్నా, కేథరీన్‌కే ఎక్కువ ఉందనీ తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ'లో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న కేథరీన్‌, ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌తో చిందేసే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించుకున్నట్లే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS