ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా మారింది ఎన్టీఆర్ పరిస్థితి. తెలంగాణాలో ఎలక్షన్స్ సందడి హీటు మీదున్న ఈ తరుణంలో అక్క సుహాసిని తరపున ఎన్టీఆర్ ప్రచారానికి రావాలా.? వద్దా.? అనే సందిగ్ధంలో ఉన్నాడు ఎన్టీఆర్. ఓ పక్క అభిమానులు ఎన్టీఆర్‌ని టీడీపీ తరపున ప్రచారానికి రావద్దని సలహా ఇస్తున్నారు. కానీ మరోవైపు నందమూరి ఫ్యామిలీ తరపున సోదరి సుహాసినికి మద్దతుగా ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి. ఆల్రెడీ నందమూరి కుటుంబం నుండి తారకరత్న ప్రచారంలో పాల్గొంటున్నాడు.
బాలకృష్ణ త్వరలో ప్రచారానికి సమర శంఖం పూరించనున్నారు. అలాగే కళ్యాణ్‌రామ్ కూడా. వీరెవ్వరికీ ప్రచారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ ఎన్టీఆర్ పరిస్థితి అలా కాదు, సో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు ఎన్టీఆర్. పోలింగ్‌కి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ తరుణంలో ఎన్టీఆర్ నామ్ కే వాస్తే ప్రచారం కానిచ్చేస్తాడా.? లేక అభిమానుల మాటకు కట్టుబడి వెనకే ఉండిపోతాడా.? అనేది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండాల్సి వచ్చినా అది మరోలా ఉండేది. కానీ ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతోంది. సో ఎన్టీఆర్ తప్పించుకోవడం కష్టమే.