‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని నలుగురు హీరోయిన్స్‌లో కేథరీన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కేథరీన్‌తో విజయ్ దేవరకొండ లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుందట. ఇంతవరకూ కేథరీన్ పాత్రకు అంతగా స్కోప్ ఉండదనే ప్రచారం జరిగింది. కానీ, ‘అబ్బెబ్బే.. నేనేం తక్కువ కాదు.. నాకూ, విజయ్‌కీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. సరికొత్త కిక్ ఇస్తుంది..’ అంటూ ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
‘బొగ్గు గనిలో రంగు మణిరా..’ అంటూ ఈ ఇద్దరికీ మధ్య సాగే డ్యూయెట్‌కి యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రెస్పాన్స్‌కి తెగ మురిసిపోతోందట కేథరీన్. మైన్స్‌కి సంబంధించిన ముఖ్య ఆఫీసర్ స్మిత పాత్రలో కేథరీన్ కనిపించనుంది ఈ సినిమాలో. స్మిత పాత్ర తనకు చాలా స్పెషల్ అని చెబుతోంది. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలనీ కోరుకుంటోంది.
ఈ సినిమా సక్సెస్ తనకెంతో అవసరం అంటోంది కూడా. ఈ సినిమా సక్సెస్ తన కెరీర్‌కి ఖచ్చితంగా యూజ్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది అందాల కేథరీన్. మరి, కేథరీన్ నమ్మకాన్ని మన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిలబెడతాడో లేదో చూడాలి .లవర్స్ డే సందర్భంగా ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.