‘కథ.. ప్రేమకథ, నా ప్రేమకథ.. నేను నా ప్రేమకథ.. నేను లేని నా ప్రేమకథ..’ అంటూ ఓ కొత్త ప్రేమకథతో వస్తున్నాడు యంగ్ హీరో నవీన్ చంద్ర. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. ఇందాకే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఓ బుక్, తిరగబడుతున్న పేజీలు , స్కెచ్చింగ్‌లో ప్రేయసి ముఖం బ్యాక్ గ్రౌండ్‌లో హీరో వాయిస్.. ఇదీ ఈ ఫస్ట్ గ్లింప్స్ కథ. ఆసక్తిగా ఉంది కదా.! వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమ ఫస్ట్ లుక్ రిలీస్ కానుంది. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్రకు జోడీగా తెలంగాణా ముద్దుగుమ్మ అదితీ మేఖల్ నటిస్తోంది. ‘అమీ తుమీ’ తదితర చిత్రాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఇక హీరో నవీన్ చంద్ర విషయానికి వస్తే, విలక్షణ నటుడిగా గుర్తింపు ఉంది. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమైనా, తనలోని నటుడికి సవాల్ విసిరే అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా విభిన్న పాత్రల తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు . హీరోగా మాత్రమే కాక, విలన్ పాత్రలతోనూ మెప్పిస్తూ బ్రేక్ ఈవెన్ కోసం ఎదురు చూస్తున్నాడు. నవీన్ చంద్ర హీరోగా ‘హీరో హీరోయిన్’ అనే మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఈ తాజా సినిమాతో సరికొత్త లవ్‌స్టోరీని పరిచయం చేస్తానంటున్నాడు. లవ్ స్టోరీ అంటే, అమ్మాయి, అబ్బాయీ ఇద్దరూ ఉంటారు. అలాంటిది ‘నేను లేని నా ప్రేమకథ..’ అంటూ ఫస్ట్ గ్లింప్స్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. అదేంటో తెలియాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిందే.