'ఎమ్మెల్యే అంటే మై లవ్ లీ ఏంజల్..' అంటూ అల్లు అర్జున్‌తో బ్యూటిఫుల్‌గా పొగిడించుకున్న ముద్దుగుమ్మ కేథరీన్ ట్రెసా తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్ధ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో 'ఆరువం' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో 'వదలడు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 11న అత్యధిక ధియేటర్స్‌లో గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైద్రాబాద్‌లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
రాజకీయ ప్రముఖులు మన్నే గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిర్మాత నట్టికుమార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో ఓ విశేషం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కి హీరో కానీ, డైరెక్టర్ కానీ హాజరు కాలేదు. వారి వారి పనుల కారణంగా వారు హాజరు కాలేకపోయారట. అయినా కానీ, హీరో, డైరెక్టర్ లేకుండానే హీరోయిన్ కేథరీన్ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కామ్‌గా కానిచ్చేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అట. ఒకప్పుడు డబ్బున్నోళ్ల రోగంగానే పరిగణించబడే క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు పేదోళ్లు, డబ్బున్నోళ్లు అనే విచక్షణ లేకుండా అందర్నీ ముంచేస్తోంది.
అయితే అసలు ఆ క్యాన్సర్‌కి కారణాలేంటీ.? అంటే అనేకం అని మనకి తెలిసిన నాలుగైదు కారణాలు టకా టకా చెప్పేయొచ్చు నేటి పరిస్థితుల్లో. అయితే, క్యాన్సర్‌కి అసలు కారణం కల్తీ ఫుడ్డే అని మన 'వదలడు' టీమ్ చెప్పబోతోందట. హీరోయిన్ కేథరీన్ అదే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. లేటెస్ట్‌గా జరిగిన ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. తెలుగులో సెకండ్ గ్లామరస్ హీరోయిన్‌గా, హాట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న కేథరీన్‌కి ఈ తాజా సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలిక.