బిగ్‌ ఎస్కేప్‌: మహేష్‌ భలే ఎస్కేప్‌ అయ్యాడే!

By Inkmantra - October 07, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

ఫస్ట్‌ టైమ్‌ నెట్టింటి అంచనా తప్పని తేలింది బిగ్‌బాస్‌ విషయంలో. గత 11 వారాలుగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ 3 సీజన్‌లో ఎలిమినేషన్స్‌ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అనుబంధంగానే నడుస్తోంది. ఈ వారం హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు.? అనే విషయం ముందుగానే నెట్టింట్లో రివీల్‌ అయిపోతోంది. దాంతో అసలు సస్పెన్సే లేకుండా ఎలిమినేషన్‌ రౌండ్‌ ముగుస్తోంది.

 

అయితే, ఈ సారి ఎలిమినేషన్స్‌లో బిగ్‌బాస్‌ తికమక చేశాడు. నెట్టింటి ప్రచారాన్ని మట్టి కరిపించాడు. బిగ్‌బాస్‌ ఎందుకలా చేశాడో అర్ధం కావడం లేదు నెటిజన్స్‌కి. మహేష్‌ ఎలిమినేట్‌ అవుతాడని ప్రచారం జరిగింది. కానీ, పునర్నవిని ఎలిమినేట్‌ చేసి, కన్‌ఫ్యూజ్‌ చేశాడు. అంతేకాదు, ఈ సారి ఎలిమినేషన్‌ రౌండ్‌ అంత హార్ట్‌ టచ్చింగ్‌గా కూడా అనిపించలేదు. ఏదో అలా జరిగిపోయిందంతే, బిగ్‌బాస్‌లో లేడీ మోనార్క్‌గా చెలామణీ అవుతోన్న పునర్నవిని ఎందుకు ఎలిమినేట్‌ చేశాడనే అంశంపై బలమైన కారణం నెటిజన్స్‌కి అంతు చిక్కడం లేదు. నిజానికి బయటి నుండి పునర్నవికి పిచ్చ ఫాలోయింగ్‌ ఉంది.

 

రాహుల్‌, పునర్నవి జంటకు ఇంకా పిచ్చ క్రేజ్‌ ఉంది. ఓట్ల పరంగా చూస్తే, కూడా మహేష్‌తో పోల్చితే, పునర్నవికే ఎక్కువ ఓట్లు పడ్డాయనే టాక్‌ కూడా ఉంది. అలాంటిది సింపుల్‌గా పునర్నవిని ఎలిమినేట్‌ చేసేశారు. అసలింతకీ పునర్నవి ఎలిమినేట్‌ అయ్యిందా.? అనే అనుమానం కలిగేలా ఈ ఎలిమినేషన్‌ని వీక్షకులు లైట్‌ తీసుకుంటున్నారు. ఏం మ్యాజిక్‌ జరిగిందో ఏమో కానీ, మహేష్‌ కోరిక నెరవేరింది. నచ్చినవాళ్లు వెళితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ నలుగురికీ తెలియాలి. ఆ నలుగురి (వరుణ్‌ అండ్‌ బ్యాచ్‌) నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయితేనే అది జరుగుతుంది.. అని మహేష్‌, బాబాతో అన్నాడు. అయితే, రాహుల్‌ ఎలిమినేట్‌ అవ్వాలని మహేష్‌ కోరుకున్నాడు. కానీ, పునర్నవిపై వేటు పడింది. ఏది ఏమైతేనేమి, మొత్తానికి బిగ్‌హౌస్‌లో మహేష్‌ మ్యాజిక్‌ ఫలించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS