ఎమ్మెల్యే అంటే మనం అనుకున్నది కాదట. 'మై లవ్లీ ఏంజల్'.. అనే కొత్తర్దం చెప్పాడు ఈ ముద్దుగుమ్మని చూసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో. బన్నీ చెప్పాడనీ కాదు కానీ నిజంగానే ఈ ముద్దుగుమ్మ కుర్రకాకుకి హాట్ అండ్ లవ్లీ ఏంజిలే. ఆమె ఎవరో కాదు కేథరీన్. గతేడాది అల్లు అర్జున్‌తో హాట్ హాట్‌గా ఎమ్మెల్యే పాత్రలో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తృటిలో మెగాస్టార్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే అవకాశం మిస్ చేసుకుంది. 'సరైనోడు' సినిమాలో హాట్ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న ఈ బొద్దు ముద్దుగుమ్మ ఈ ఏడాది రానా సినిమాతో సందడి చేయనుంది. ఈ సినిమాలో కూడా అమ్మడిది డిగ్నిఫైడ్ క్యారెక్టరే. ఆఫ్కోర్స్ హాట్ అప్పీల్‌కి కూడా ఏమాత్రం లోటుండదటలెండి. తేజ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో ఓ టీవీ ఛానల్ ఓనర్‌గా హాట్ లుక్స్‌తో మత్తెక్కించడడానికి కేథరీన్ రెడీ అవుతోందట.