లవ్‌లీ ఏంజెల్‌ కేధరీన్‌కి భలే ఛాన్సులే.!

By iQlikMovies - December 28, 2019 - 14:20 PM IST

మరిన్ని వార్తలు

అదేంటో స్టార్‌డమ్‌ లేకున్నా, కేథరీన్‌ కోసం డిజైన్‌ కాబోయే పాత్రలు ప్రత్యేకంగా ఉంటుంటాయి. ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేసినా, స్పెషల్‌ రోల్‌లో నటించినా వాటిలో ప్రేక్షకుడి మనసులో రిజిస్టర్‌ అయ్యే పాత్రలే ఎక్కువ.

 

ఇప్పుడు కూడా ఈ బ్యూటీ అలాంటి పాత్రనే చేజిక్కించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ సినిమా కోసమంటారా.? ఇంకేం సినిమా బోయపాటి - బాలయ్య సినిమాలో. ఓ వైపు ఈ సినిమా హోల్డ్‌లో పడిందనే వార్తలు వినిపిస్తున్నా, గ్రౌండ్‌ వర్క్‌ నుండి ఏదో ఒక అప్‌డేట్‌ హల్‌చల్‌ చేస్తూనే ఉంది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమాకి కథ సిద్ధమవుతోందట. ఆ క్రమంలో హీరోయిన్‌గా నటిస్తున్న కేథరీన్‌ని ఓ గవర్నమెంట్‌ ఆఫీసర్‌ పాత్రలో చూపించబోతున్నాడట దర్శకుడు బోయపాటి. అది ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రనీ తెలుస్తోంది. స్ట్రిట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కేథరీన్‌ కనిపించనుందట.

 

ఆల్రెడీ ఎమ్మెల్యే పాత్రలో 'సరైనోడు' సినిమాలో హుందాతనం చూపించింది. ఓ పక్క హుందాగా కనిపిస్తూనే, అల్లు అర్జున్‌తో 'మై లవ్‌లీ ఏంజెల్‌' అని పిలిపించుకుంటూ, అభిమానులకీ లవ్‌లీ ఏంజెల్‌ అయిపోయింది. ఎమ్మెల్యే అంటే మై లవ్‌లీ ఏంజెల్‌ అని బన్నీ చేత కొత్తర్ధాన్ని పలికించిన బోయపాటి, ఇప్పుడు ఐఏఎస్‌ అంటూ ఈ ముద్దుగుమ్మకి బాలయ్యతో కూడా ఏదైనా కొత్త అర్ధం చెప్పిస్తాడేమో చూడాలి మరి. ఇటీవల 'రూలర్‌'తో నిరాశపరిచిన బాలయ్యకు ఎలాగైనా మంచి హిట్‌ ఇవ్వాలన్న కసితో ఉన్నాడట బోయపాటి. ఆ దిశగానే ఈ సినిమాకి స్క్రిప్టు పనులు చేస్తున్నాడనీ తెలుస్తోంది. రేపో మాపో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS