'సరైనోడు' సినిమాలోని ఎమ్మెల్యే పాత్రతో ముద్దుగుమ్మ కేథరీన్‌కి మంచి పేరొచ్చింది. ఎమ్యెల్యే పాత్రలో చాలా అందంగా హుందాగా కనిపించి మెప్పించింది కేథరీన్ ఆ సినిమాలో. ఈ ముద్దుగుమ్మకి ఎక్కువ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లే వస్తూ ఉంటాయి. అయినా కానీ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లే అంటోంది. హీరోయిన్‌గా కెరీర్‌లో ముందుకెళ్లాలంటే గ్లామర్ తప్పనిసరి. తనకొచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఓ పక్క గ్లామర్‌ని పండిస్తూనే మరో పక్క ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కావడం తన అదృష్టం అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'గౌతమ్ నందా' సినిమాలో నటిస్తోంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటీ. ట్రైలర్‌లో అమ్మడు అందాల ఆరబోత చూసి పక్కా గ్లామరస్ క్యారెక్టర్ అనుకుంటున్నారంతా. అయితే కేథరీన్‌ది చాలా స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అట ఈ సినిమాలో. డైరెక్టర్ ఈ క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశాడంటోంది. అలాగే రానా హీరోగా తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోనూ కేథరీన్ నటిస్తోంది. ఆ సినిమాలో తన పాత్ర ఇంత వరకూ చేసిన పాత్రలన్నింట్లోనూ భిన్నంగా ఉంటుందట. కొంచెం నెగిటివ్ షేడ్స్‌నీ చూపిస్తుందట ఈ సినిమా ద్వారా ముద్దుగుమ్మ కేథరీన్. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగష్టులో విడుదల కానుంది. మెయిన్ హీరోయిన్‌గా కాకపోయినా, ఇలా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌లో నటించడమే తనకెంతో ఇష్టం అంటోంది ముద్దుగుమ్మ కేథరీన్.