SIT విచారణకి ఇవ్వాల నటి చార్మీ హాజరయింది.
వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది వెంట రాగా ఆమె అనుకున్న సమయానికి ముందే చార్మీ ఆబ్కారీ శాఖ ఆఫీస్ కి వచ్చింది. అలాగే చార్మీ విచారణకి వెళుతూ మీడియా కి నమస్కరించడం కొసమెరుపు.
ఇక ఆమె విచారణ కోసం SIT సభ్యులు సిద్ధం అయ్యారు అని అలాగే ఆమె నుండి ఎటువంటి సమాధానలు చెప్పించాలని ప్రణాళికలు తయారు చేసుకున్నట్టు తెలుస్తున్నది.
నిన్న ఆమె సిట్ విచారణ పై హైకోర్టు సైతం పిటీషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమెకి సంబందించిన విచారణ మహిళా అధికారుల సమక్షంలో జరగలాని అలాగే ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల మధ్యలోనే ఆమె విచారణ కొనసాగాలి అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అదే విధంగా ఆమె అనుమతి లేకుండా బ్లడ్, గోళ్ళు, వెంట్రుకల శాంపిల్స్ తీసుకోవద్దు అంటూ రూలింగ్ ఇచ్చింది.