టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ కేథరీన్ ఓ అరుదైన ఆఫర్ దక్కించుకుంది. ఇండియా మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది. ప్రభుదేవా, కేథరీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ప్రభుదేవా స్వీయ నిర్మాణంలో రూపొందబోతోన్న ఈ సినిమా ఓ డిఫరెంట్ మూవీ అట. అలా అని హారర్ థ్రిల్లర్ లాంటి కాన్సెప్ట్ కూడా కాదట. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని సమాచారమ్. గతేడాది ప్రభుదేవా నిర్మాణంలో మిల్కీ బ్యూటీ తమన్నాతో హారర్ కామెడీ సినిమా 'అభినేత్రి' వచ్చింది. సింప్లీ సూపర్బ్‌గా రూపొందిని ఆ చిత్రం ఘన విజయం సాధించింది. తమన్నా నటన, డాన్సులు ఆ సినిమాకి హైలైట్ అయ్యాయి. అదే తరహాలో ఈ సినిమాలో కూడా డాన్సులు ప్రధానాంశంగా ఉండబోతున్నాయట. కేథరీన్ మంచి నటే కాకుండా అదరిపోయే డాన్సులతో ఆకట్టుకునే డాన్సింగ్ డాళ్ కూడా. సో ఈ అమ్మడు కూడా ప్రభుదేవాతో కలిసి ఓ డాన్సింగ్ సెన్సేషన్‌కి రెడీ అయిపోతుందన్న మాటే. అమ్మడికి మెగాస్టార్‌తో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యింది. ఒకవేళ ఆ ఛాన్సే కనుక వచ్చుంటే ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్‌లో తన డాన్సింగ్ టాలెంట్ చూపించేసేది. సో అలా మిస్ చేసుకున్న ఛాన్స్‌ని ఈ సినిమాతో దక్కించుకుంది కాబోలు. ఈ సినిమాతో అటు తమిళంలోనూ, తెలుగులోనూ కూడా తన టాలెంట్‌తో విజృంభిస్తానంటోంది కేథరీన్. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ భామ.