తెలుగు నేర్చుకుంటోన్న ముద్దుగుమ్మ

మరిన్ని వార్తలు

అచ్చ తెలుగు ముద్దుగుమ్మలకి తెలుగు పరిశ్రమలో అంతగా ఆదరణ దక్కడం లేదు. సో మన తెలుగు భామలైన అంజలి, తదితర భామలకు తెలుగు పరిశ్రమ కన్నా, తమిళ, మలయాళ పరిశ్రమల్లో ఎక్కువ ఆదరణ దక్కుతుంది. పొరుగింటి పుల్ల కూరకి రుచి చాలా ఎక్కువ కదా. అలాగే పొరుగింటి భామలు తెలుగులో సత్తా చాటుతున్నారు. అయితే ఎక్కడ ఉంటే అక్కడే తమ సొంతిల్లుగా భావిస్తున్నారు నేటితరం ముద్దుగుమ్మలు. అందుకే పొరుగు దేశాల నుంచి వచ్చినా కానీ, తెలుగు పరిశ్రమపై అభిమానం పెంచుకున్నారు. అలాగే తెలుగు నేర్చుకోవడంలో కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అదే దారిలోకి మరో ముద్దుగుమ్మ కేథరీన్‌ కూడా చేరిపోయింది. ఈ అమ్మడు తాజా చిత్రం 'గౌతమ్‌ నందా'. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ కథానాయకుడుగా నటిస్తున్నాడు. కేథరీన్‌తో పాటు, హన్సిక మరో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం కేథరీన్‌ తెలుగు నేర్చుకుంటోందట. ముద్దు ముద్దుగా తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పేసుకుంటుందట. గతంలో తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తాప్సీ తదితర కథానాయికలు తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు పరాయి గొంతును అరువు తెచ్చుకోకుండా సొంత గొంతును వినిపించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు ఆ వంతు కేథరీన్‌కి వచ్చింది. అమ్మడు చూడడానికి బొద్దుగా ముద్దుగానే కాదు, మాట్లాడినా చాలా ముద్దుగా ఉంటుంది. ఇంకెందుకాలస్యం ఆమె గొంతు వినేద్దాం త్వరలోనే. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS