కరోనా సందర్భంగా 21 రోజులు దాదాపు నా లుగు వారాలనుకోండి.. కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కరోజు కాదు, రెండు రోజు లు కాదు.. ఏకంగా 4 వారాలు ఇంట్లోనే ఉండి ఏం చేయాలి.? అందుకే కొందరు సెబ్రిటీలు కొన్ని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈ లాక్డౌన్ సమయాన్ని తగిన విధంగా వాడుకోవాలనుకుంటున్నారు. కొత్త కొత్త అంశాల్ని నేర్చుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా, చాలా మంది ఇప్పటికే సక్సెస్ అయ్యారు కూడా. ఇక మన నిఖిల్ విషయానికి వస్తే, ఇంట్లో ఊరికే కూర్చోకుండా కండలు పెంచే పనిలో ఉన్నాడట.
ఇంతవరకూ నిఖిల్ సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. కానీ, ఈ కరోనా నా లుగు వారాల్లో టార్గెట్ పూర్తి చేస్తాడట. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చూస్తుంటే, ఇప్పటికే సిక్స్ ప్యాక్ యాబ్స్ కనిపిస్తున్నాయి. ఇది కాక మరింకేం టార్గెట్ పెట్టుకున్నాడో. ఏమో కానీ, ఈ కుర్ర హీరో తీరు చూస్తుంటే, అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలానే ఉన్నాడండోయ్. మరోవైపు కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు తన వంతు సాయమందించడంలోనూ యాక్టివ్గానే ఉన్నాడు నిఖిల్. లాక్ డౌన్లో తమ ఆరోగ్యాన్నీ, ఫ్యామిలీని లెక్క చేయకుండా, నిస్వార్ధంగా సేవలందిస్తున్న పోలీసు సోదరులకు నిఖిల్ శానిటైజర్లు, మాస్క్లు అందించిన సంగతి తెలిసిందే.