సోనాలి కి ధైర్యం చెప్పిన చిత్రపరిశ్రమ

By iQlikMovies - July 05, 2018 - 17:52 PM IST

మరిన్ని వార్తలు

కేన్సర్ తో బాధపడుతున్న సోనాలి బింద్రే కి యావత్ సినీ కుటుంబం అండగా నిలుస్తున్నది. ఆమె ఆరోగ్య స్థితి గురించిన విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసిన వెంటనే సినీలోకం మొత్తం ఆమెకి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ముందుకి వస్తున్నారు.

ఆమెకి వచ్చిన క్యాన్సర్ స్టేజ్ 4 లో ఉందని అని ఆమె తెలియచేయడంతో ఆమె వ్యాది తీవ్రత మనకి అర్ధమవుతుంది, ప్రస్తుతం అమెరికాలోని క్యాన్సర్ఆసుపరిలో ఆమె చికిత్స తీసుకుంటున్నది. ఇక ఆమెకి మద్దతుగా బాలీవుడ్, టాలీవుడ్ కి చెందిన హీరోలు, హీరొయిన్స్, నటులు సోషల్ మీడియా లో సోనాలి కి ధైర్యం చెబుతూ పోస్ట్ లు పెట్టారు.

అందులో మన తెలుగు పరిశ్రమకి చెందిన ప్రముఖ హీరోలు నాగార్జున, సుమంత్ తదితరులు ఉన్నారు. ఇక గతంలో కూడా మనీషా కొయిరాల కూడా క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడి గెలిచింది. ఇప్పుడు సోనాలి కూడా అలానే క్యాన్సర్ తో పోరాడి గెలుస్తుంది అని అందరు ఆశిస్తున్నారు. 

మనం కూడా సోనాలి సరైన చికిత్స్ తీసుకుని మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతురాలు కావాలని కోరుకుందాం..   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS