సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ, స్టార్స్ తమ సినిమాల్లో సిగరెట్ స్మోకింగ్ చేయరాదనీ, అలాగే మద్యం సేవించకూడదనీ చేసిన సూచన వివాదాస్పదమవుతోంది. అది నటనే అయినప్పటికీ చూసే అభిమానులు ఆ స్టైల్స్‌ని ఫాలో అయి, మద్యానికీ స్మోకింగ్‌కీ అలవాటు పడ్తారని ఆయన అంటున్నారు. సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ హోదాలో ఆయన జారీ చేసిన ఆదేశాల పట్ల బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా వివిధ సినీ పరిశ్రమల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ పండాలంటే కొన్ని కొన్ని తప్పదని దర్శక నిర్మాతలు, నటీనటులు అంటున్నారు. 'సిగరెట్ స్మోకింగ్ హానికరం, ఆల్కహాల్ సేవించడం హానికరం' అనే హెచ్చరికలు సినిమా ప్రదర్శితమవుతున్నప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఈ నిబంధనకు అదనంగా స్టార్స్ స్మోకింగ్ చేస్తున్న సన్నివేశాలే కనిపించకూడదనే హెచ్చరికలతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. అయితే ఇది మంచి ఆలోచనేగానీ, క్రియేటివ్ రంగం అయిన సినిమాల్లో ఇదెంతవరకు సబబు? అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సినిమాల్లో స్టార్స్ సిట్యువేషనల్‌గా ఏ రకమైన నటననైనా నటించి చూపించాల్సి వస్తుంది. అలా నటించకపోతే, అక్కడ సిట్యువేషన్ ఏంటనేది చూసే ప్రేక్షకుడికి తెలీదు. అప్పుడు అది కాషన్ అని కూడా ఎవరికీ తెలీదు. అందుకే ఇది ఒక రకంగా అభ్యంతరకరమైన విషయమే అయినప్పటికీ, ఏమో చూడాలి మరి ఆయన అభ్యర్ధన వర్కవుట్ అవుతుందో లేదో!