కుర్రోళ్లోయ్‌ కుమ్ముడే కుమ్ముడోయ్‌!

మరిన్ని వార్తలు

ఫిబ్రవరి వచ్చేస్తోంది. సినిమాల జాతర మొదలైపోతోంది. ఈ ఏడాది స్టార్టింగ్‌లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసి, విడుదలయ్యాక బాక్సాఫీస్‌ని బాగా నిరాశపరిచాయి. దాంతో టాలీవుడ్‌ దృష్టంతా ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి పైనే ఉంది. ఆశలన్నీ ఫిబ్రవరిలో రానున్న సినిమాల పైనే. ఈ నెల్లో ముఖ్యంగా కుర్రాళ్ల జోరు బాగా ఉందని చెప్పొచ్చు. 

ఫిబ్రవరి 2న యంగ్‌ హీరో నాగ శౌర్య నటించిన 'ఛలో' విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరెక్కించారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 3న మరో యంగ్‌ హీరో రాహుల్‌ రవీంద్రన్‌ సినిమా 'హౌరా బ్రిడ్జ్‌' విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ఇది. 

కాగా ఫిబ్రవరి 9న మెగా హీరోలు సాయి ధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌ పోటీ పడనున్నారు. తేజు 'ఇంటెలిజెంట్‌'తోనూ, వరుణ్‌ 'తొలిప్రేమ' సినిమాతో రానున్నారు. ఈ రెండు సినిమాలపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వినాయక్‌ - తేజు కాంబినేషన్‌లో వస్తోంది 'ఇంటెలిజెంట్‌', లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' తెరకెక్కింది. రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌. కాగా కుర్రోళ్ల జోరు ఇలా ఉండగా, ఇదే టైంలో స్టార్‌ హీరోలు కూడా రంగంలోకి దిగుతున్నారు. 

ఫిబ్రవరి 2నే రవితేజ 'టచ్‌ చేసి చూడు' సినిమాతో వస్తున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత వచ్చి 'రాజా ది గ్రేట్‌' సినిమాతో హిట్‌ కొట్టిన జోరులో ఉన్న రవితేజ 'టచ్‌ చేసి  చూడు'తోనూ మాయ చేసేలానే ఉన్నాడు. ఇకపోతే ఫిబ్రవరి 9నే మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గాయత్రి' సినిమా దూసుకొస్తోంది. డిఫరెంట్‌ జోనర్‌ మూవీగా ఈ సినిమా పైనా ఆశక్తి ఎక్కువగా ఉంది. చూడాలి మరి వీరిలో ఎవరెవరు బాక్సాఫీస్‌ వద్ద ఎంతెంత వసూళ్లు సాధిస్తారో..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS