సినీనటుడు సామ్రాట్ పైన వేధింపులు, వరకట్నం కేసు నమోదు చేసి ఆయనని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే అసలు ఏమి జరిగింది అన్నది సామ్రాట్ భార్య హర్షితా రెడ్డి మీడియాకి వివరించింది. ఆమె చెప్పిన మాటలు విని రిపోర్టర్లు, ఆ వీడియో చూస్తున్న ప్రేక్షకులు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే సామ్రాట్ ఆమెని అన్ని రకాలుగా వేధించాడు అని ఆమె చెప్పిన విధానం అలాగే పలుమార్లు ఆమె కంటతడి పెట్టుకోవడం కూడా ఆమె బాధ తీవ్రతని తెలియచేసింది.
అయితే తమ పెండ్లి అయిన రెండు సంవత్సరాల నుండి కూడా ఆమెని అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉండడం అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కొట్టడం వంటివి చేసేవాడట. అలాగే సామ్రాట్ కి హుక్కా, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు కూడా బాగా ఉన్నాయి అని చెప్పింది, ఒకసారి తన చేత కూడా హుక్కా తాగించడానికి ప్రయత్నించాడు అని తెలిపింది.
ఇక ఒకసారి తనని సామ్రాట్ సహా అతని కుటుంబసభ్యులు చంపే ప్రయత్నం చేశాక వెంటనే తన తల్లిదండ్రులకి విషయం చెబితే రాజేంద్రనగర్ పోలీసులని ఆశ్రయించగా వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. ఆ తరువాత అతని వేరే ఇంటిలో ఉంచి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి కొట్టడం అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తుండేవాడు అని తెలిపింది. అందుకోసమే CCTV కెమెరాలు పెట్టించి అతను చేసే ఆకృత్యాలని రికార్డు చేయించడం జరిగింది. అవే ఇప్పుడు పోలీసు వారికి అందచేయడంతో సామ్రాట్ ని అరెస్ట్ చేశారు అని తెలిపింది. దయచేసి ఇది చూసి అయినా ఇలా చేస్తున్న వారు అలాంటి పనులు చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇక మరోవైపు, హర్షితా రెడ్డి తండ్రి సామ్రాట్ ఒక ‘గే’ అని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.