'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రాత్మక చిత్రం. ఆడియో ఫంక్షన్‌కి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఈ సినిమాకి హాజరై తమ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు తెలుసుకోవల్సిన చరిత్ర గాధ ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాకి తెలంగాణా ప్రభుత్వం పన్ను రాయితీని ప్రకటించింది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా పన్ను రాయితీని ప్రకటించాలి. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి. అమరావతి కేంద్రంగా తన పరిపాలన సాగించిన చక్రవర్తి కథే ఈ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా. అందుకే ఈ బాధ్యత మొదట ఎక్కువగా చంద్రబాబు పైనే ఉంది. అంతేకాదు పన్ను రాయితీని ప్రకటించడమే కాదు. దాంతో పాటు ఈ సినిమా ప్రమోషన్స్‌కి ప్రభుత్వం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే అని అభిమానులు భావిస్తున్నారు. ఆ రకంగా ఈ సినిమా విజయంలో చంద్రబాబు కూడా తన వంతు పాత్రను పోషించినట్టు అవుతుంది. బాలయ్యకు ఇది వందో సినిమా. అంతేకాదు స్వయానా బాలయ్య, చంద్రబాబుకు బావమరిది కూడా. ఇంత గొప్ప చరిత్ర గల సినిమాలో ఆయన నటిస్తున్నందుకు బాలయ్యని చంద్రబాబు ప్రోత్సహించాలి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి, క్రిష్ ఈ సినిమాను అనుకున్న టైంకే పూర్తి చేయడం విశేషం. అచ్చంగా సంక్రాంతికి అచ్చతెలుగు సినిమా శాతకర్ణి రావడం అనేది శుభ పరిణామం.