ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజమే అతన్ని కెరీర్‌లో అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. 'బాహుబలి' సినిమాకి దేశవ్యాప్త గుర్తింపు లభించినా, రాజమౌళి మునుపు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. 'బాహుబలి' కోసం ప్రభాస్ తన కెరీర్‌ని త్యాగం చేసిన విషయం రాజమౌళికి ఎప్పుడూ గుర్తుంటుంది. అందుకే 'బాహుబలి' కోసం ఇంత త్యాగం చేసిన ప్రభాస్‌కి థ్యాంక్స్ చెప్పాడు. సినిమా అంటే అందరి సమిష్టి కృషి. రాజమౌళి దర్శకుడిగా, ప్రభాస్ నటుడిగా 'బాహుబలి' కోసం ప్రాణం పెట్టారు. మూడేళ్ళు 'బాహుబలి' కోసం శ్రమించినందుకు రాజమౌళి, ప్రభాస్‌కి థ్యాంక్స్ చెప్పడం అభినందనీయమే. కానీ ప్రభాస్, తనకు 'బాహుబలి'ని ఇచ్చిన రాజమౌళికే థ్యాంక్స్ చెబుతున్నాడు. ప్రభాస్‌ని టాలీవుడ్‌లో అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. ఆ డార్లింగ్‌కే డార్లింగ్ అనిపించుకున్నాడు రాజమౌళి. ఎవరి పని వారు చేశారనుకోవడం కాదు, ఒకరికి ఒకరు కృతజ్ఞతలు తెలుపుకోవడం వారి మధ్య అనుబంధాన్ని మరింతగా చాటుతోంది. 'బాహుబలి' సినిమాతో ఈ రకమైన ఆహ్లాదరకమైన వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా టెక్నీషియన్స్‌కి కూడా రాజమౌళి కృతజ్ఞతలు చెప్పడం విశేషం. అది రాజమౌళి సంస్కారాన్ని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు జవాబు తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది. వెయిట్ ఆండ్ సీ.