`ఛత్రపతి` హిందీ రీమేక్‌తో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయడం తన కెరీర్‌లో తీసుకున్న అతి పెద్ద నిర్ణయమని చెబుతున్నాడీ యువ హీరో. ఛత్రపతి విడుదలై చాలా ఏళ్లయ్యింది. ఈ సినిమా హిందీలోనూ డబ్ అయ్యింది. అలాంటప్పుడు ఇప్పుడు రీమేక్ చేయడంలో లాభమేముందన్నది చాలామంది ప్రశ్న. దీనికి బెల్లంకొండ స్పష్టమైన సమాధానం చెప్పాడు.
``ఛత్రపతి కథ అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశాం. ఛత్రపతి చూసినవాళ్లకు సైతం ఈ కథ కొత్త గా అనిపిస్తుంది. నేను నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. వాటికి మంచి ఆదరణ వచ్చింది. నార్త్ లో చాలా ప్రాంతాల్లో నేను తెలుసు. నా సినిమాల్ని వాళ్లు బాగా ఆదరిస్తున్నారు. అందుకే హిందీలో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఛత్రపతి రీమేక్ చేసే అవకాశం నాకొస్తుందని నేను అనుకోలేదు. ప్రభాస్ గా కనిపించడం అతి పెద్ద ఛాలెంజ్. తప్పకుండా ఆ పాత్రకు న్యాయం చేస్తా`` అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ. 2021 జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాతోనే వి.వి.వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు