పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్ రాజు 'పింక్' సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ని బట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్నారనీ, సో సినిమాకి 'లాయర్ సాబ్' టైటిల్ యాప్ట్ అవుతుందనీ ఇప్పటికే ఫ్యాన్స్ ఫిక్సయిపోయి తదనుగుణంగా పోస్టర్ డిజైన్లు కూడా చేసేశారు. కానీ, లేటెస్ట్‌గా ఈ సినిమాకి టైటిల్ అది కాదంటూ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. అయినా, ఒరిజినల్‌లో ఉండే కథకీ, తెలుగు రీమేక్ కథకీ అస్సలు పోలికలే ఉండవనీ ఆయన అంటున్నారు.
ఎవ్వరూ ఊహించని సరికొత్త కోణంలో ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా, సినిమాకి సంబంధించి ఒక్క లీక్ కూడా జరగడం లేదు. ఏవో ఒకటీ అరా లీకులు వచ్చినా, ఆవేమీ సినిమా కథని రివీల్ చేసేంతలా లేవు. షూటింగ్‌లో పాల్గొటున్నా, పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గెటప్ కూడా మారలేదు. సో ఇలా ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాలూ చాలా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ముగ్గురు హీరోయిన్లు నటించాల్సిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి అంటూ ఇద్దరి పేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. ఆ మూడో హీరోయిన్ పేరు కూడా బయటికి రాలేదు. కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం దాదాపు కన్‌ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
మేలో సినిమా రిలీజ్ చేయనున్నారట. ఉగాదికి టైటిల్ కన్‌ఫామ్ చేయనున్నారట. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.