ఇక సెలవు అనేసిన విజయశాంతి.. అదేంటీ.? ఎందుకీ సెలవు.? అని ఆశ్చర్యపోతున్నారా.? లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఇటీవల 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాతో పాటు, ఆమె పాత్రకు కూడా మంచి పేరు దక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే, ఇంతలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లేటెస్ట్‌గా సినిమాలకు సెలవు ప్రకటిస్తూ, ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కి ఫ్యాన్స్ షాకయ్యారు. ఇంతలోనే సెలవు ప్రకటించేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు.
#సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు
— VijayashanthiOfficial (@vijayashanthi_m) February 2, 2020
నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.
'సరిలేరు..'లో భారతి పాత్రను ఎంతగానో అభిమానించిన అభిమానులు, విజయశాంతి నుండి ఇలాంటి మరెన్నో పాత్రల్ని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, ఇలాంటి ట్వీట్ వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. మంచి కథలు దొరికితే, సినిమాల్లో కంటిన్యూ చేస్తానని తెలిపిన ఆమె, సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణమేమై ఉంటుందా.? అని ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. కానీ, తన జీవితం రాజకీయాలకే అంకితం.. ప్రజా జీవితానికే తన తొలి ప్రాధాన్యత అని విజయ శాంతి తెలపడం, రాజకీయాల్లో ఇకపై ఆమె యాక్టివ్ కానున్నారని తెలిసేలా చేస్తోంది.