ఆయ‌న‌తో సినిమా అంటే రిస్కే క‌దా బాల‌య్యా..?!

By Gowthami - March 03, 2020 - 08:33 AM IST

మరిన్ని వార్తలు

స‌క్సెస్ ఎటుంటే అటు ప‌రిగెత్త‌డం సినిమావాళ్ల‌కు అల‌వాటు. స‌క్సెస్ లేనివారి ద‌గ్గ‌ర సినిమావాళ్లు అస‌లు నిల‌బ‌డ‌రనే టాక్ కూడా ఉంది. కొంత‌వ‌ర‌కు అది నిజంకూడా. కానీ.. ఒక్క‌రు మాత్రం స‌క్సెస్‌తో ప‌ని లేకుండా నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు, హీరోయిన్ల‌కూ అవ‌కాశాలిచ్చేస్తుంటాడు.. ఆయ‌నే నంద‌మూరి బాల‌కృష్ణ‌. క‌థ న‌చ్చితే స‌ద‌రు ద‌ర్శ‌కుడు స‌క్సెస్‌లో ఉన్నాడా? లేడా? అనేది చూడ‌డు.. గ‌త రికార్డులు ప‌ట్టించుకోడు. క‌ళ్లుమూసుకుని అవ‌కాశాలిచ్చేస్తాడు. ఈ మంచిత‌నం వ‌ల్ల ఎన్నో అప‌జ‌యాలను ఎదుర్కొన్నాడాయ‌న‌.

 

ప్ర‌స్తుతం బాల‌య్య‌ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య న‌టించే సినిమాకు బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. ఈ వార్త బ‌య‌టికి పొక్క‌డంతో అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఎందుకంటే.. బి.గోపాల్ ఇప్ప‌టి ద‌ర్శ‌కుడు కాదు. ఆయ‌నతో పాటు ఆయ‌న తోటి ద‌ర్శ‌కులంతా రిటైరైపోయారుకూడా. ఇలాంటి స‌మ‌యంలో బి.గోపాల్ కి అవ‌కాశం ఇవ్వ‌డం సాహ‌స‌మే. అయితే ఈ సినిమా క‌థ ఇంకా ఫైన‌ల్ కాలేదు. బాల‌య్యతో అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకున్న ఓ స్టార్‌రైట‌ర్‌ ఈ సినిమాకు క‌థ అందించ‌నున్న‌ట్టు స‌మాచారం. బాల‌య్య-బి.గోపాల్ కాంబినేష‌న్ సాధార‌ణ‌మైందికాదు.. లారీడ్రైవ‌ర్‌, రౌడీఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు..

 

ఇలా అన్నీ ఒక‌దాన్నిమించి ఒక‌టి విజ‌యాల‌ను అందుకున్నాయ్‌.. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చివ‌రి సినిమా ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు మాత్రం దారుణమైన ఫ్లాప్‌. పైగా ఈ సినిమాకోసం బి.గోపాల్ తీసిన అస‌హ‌జ స‌న్నివేశాలు బాల‌య్య‌కు చాలా బ్యాడ్ తీసుకొచ్చాయ్‌. ఈ రోజుకీ అవి సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయ్‌.. మ‌రి అంత ప‌రాజ‌యం త‌ర్వాత కూడా అస‌లు లైమ్‌లైట్లోలేని బి.గోపాల్‌కి అవ‌కాశం ఇవ్వ‌డం బాల‌య్య‌కు మాత్ర‌మే సాథ్యం..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS