తెలుగులో సూపర్ హిట్టయిన `ఛత్రపతి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ సినిమా టైటిల్ కోసం చిత్రబృందం చాలా రకాలుగా ఆలోచించింది.
చివరికి తెలుగు `ఛత్రపతి`నే హిందీలోనూ కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయ్యింది. పాటలు బాకీ. ప్రభాస్ ని మాస్ కి మరింత దగ్గర చేసిన సినిమా ఛత్రపతి. ఈ సినిమా హిందీలో డబ్ అయి... అక్కడ కూడా హిట్టయ్యింది. బెల్లంకొండకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. తన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి, మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. బెల్లంకొండ సినిమా అంటే హిందీ శాటిలైట్ రూపంలోనే రూ.10 కోట్లు వస్తుంటాయి. అందుకే.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. అందుకే.. సెకండాఫ్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశార్ట. విజయేంద్ర ప్రసాద్ ఈసినిమాలోని సన్నివేశాల్ని కొత్త తరహాలో రాశారని, ఛత్రపతి చూసినవాళ్లకు కూడా ఈ సినిమా కొత్తగా కనిపించబోతోందని, అందుకే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని టాక్. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.