సూర్య,కార్తి నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజాపై ఇప్పుడు చీటింగ్ కేసు నమోదైంది. తమిళ నాడులోని రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో వినియోగ దారులకు రూ. 300 కోట్ల మేరకు మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. తమిళనాడులోని మణి అండ్ గ్యాంగ్ పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థ ఉంది. అది ఇటీవలే ఐపీ ఎత్తేసింది.
ఈ సంస్థతో జ్ఞానవేల్ కి సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. దాంతో జ్ఞానవేల్ పైనా చీటింగ్ కేసు నమోదైంది. అయితే... జ్ఞానవేల్ మాత్రం ఈ సంస్థతో తనకు ఎలాంటి సంబంధాలూ లేవని, కేవలం తన సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్ మాత్రమే తీసుకునేవాడినని అంటున్నారు. ఆగష్టు 7న రామనాథపురం పోలీస్ స్టేషన్‌కి నేరుగావెళ్లి వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు జ్ఞానవేల్ రాజాకు నోటీసులు జారీ చేసింది.