ఈ అమ్మాయి ఎవరో గుర్తు పడతారా? గుర్తు పట్టలేరులెండి. తేజ సినిమా 'చిత్రం' గుర్తుండే ఉంటుంది కదా. ఆ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్‌కి చిన్న తమ్ముడిగా నటించిన క్యూట్ పిల్లాడే ఈ అమ్మాయి. ఇప్పుడు హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు నటుడు ఉత్తేజ్ గారాల పట్టి చేతన. వావ్! చేతన ట్రెండీ లుక్స్‌లో అదరగొట్టేస్తోంది కదా. ఈ భామ హీరోయిన్‌గా 'పిచ్చిగా నచ్చావ్' సినిమా తెరకెక్కుతోంది. శశి భూషణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అట. ఈ తరం యువతని బాగా అట్రాక్ట్ చేసేలా ఈ సినిమా స్టోరీ ఉంటుందంటున్నారు. బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్స్‌గా ఓ రేంజ్‌కి చేరిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. ఆ కోవలో చేతన కూడా చేరుతుందని ఆశిస్తూ, హీరోయిన్‌గా ఆమె మంచి అవకాశాలను దక్కించుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.