మిల్కీతో కళ్యాణ్‌రామ్‌ రొమాన్స్‌ అదిరెలే.!

By iQlikMovies - April 18, 2018 - 18:24 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'నా నువ్వే'. తాజాగా ఈ సినిమా నుండి సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ వీడియో ప్రోమోలు పిచ్చెక్కించేస్తున్నాయి. 'చినికి చినికి..' అంటూ సాగే ఈ పాటలో తమన్నా, కళ్యాణ్‌రామ్‌ మధ్య కెమిస్ట్రీ అదరిపోయిందంతే. 

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌తోనే వీరిద్దరూ కెవ్వుకేక పుట్టిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే వీరి కెమిస్ట్రీ అదరహో అనే రేంజ్‌లు ఉంది. అయితే ఈ సాంగ్‌ ప్రోమోస్‌ చూస్తుంటే, ఆ అంచనాలు మరీ పెరిగిపోయాయ్‌. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా సినిమాల్లో హాట్‌గా కనిపించింది. ముఖ్యంగా సాంగ్స్‌ విషయానికి వస్తే, తమన్నా చేసిన సినిమాల్లో హాటెస్ట్‌ సాంగ్‌ అంటే 'బాహుబలి'లోని 'పచ్చబొట్టేసిన పిల్లగాడా..' సాంగ్‌ అనే చెప్పాలి. అయితే ఈ సాంగ్‌లో తమన్నా, కళ్యాణ్‌రామ్‌ అంతకు మించి అనే స్థాయిలో రొమాన్స్‌ పండించేశారు. 

కానీ ఎక్కడా వల్గారిటీ లేదు. హాట్‌గా ఉందంతే. ప్రోమోస్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక ఫుల్‌ సాంగ్‌ వీడియో ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో కదా. కళ్యాణ్‌రామ్‌తో తమన్నా నటిస్తున్న తొలి చిత్రమిది. అయితే కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో రూపొందిన 'జై లవకువ'లో తమన్నా ఐటెం సాంగ్‌ చేసింది. జయేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS