'రాజుగారి గది - 2' సినిమా ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తుందని అనుకున్నారంతా. కానీ అది దయ్యం పాత్రని ఊహించలేదు. ట్రైలర్‌తో ఆ సస్పెన్స్ వీడిపోయినప్పటికీ, ఊహించని అప్డేట్స్ ఈ క్యారెక్టర్ గురించి తెలుస్తున్నాయి. ట్రైలర్లో సమంత క్యారెక్టర్ని కామెడీ దయ్యంగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఈ దయ్యానికి చాలా భావోద్వేగాలుంటాయట. ఊహించని స్థాయిలో ఎమోషన్స్ ప్రదర్శిస్తుందట ఈ క్యారెక్టర్ ద్వారా సమంత. ఈ విషయాల్ని సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఒక్కోసారి సీన్‌కి తగ్గట్లుగా ఫీలవడంతో, దుఃఖం ఆపుకోలేకపోయేదట చిన్మయి. అంటే సమంత పాత్ర ఏడిపిస్తుందా? అంటే అదొక్కటే కాదు, చాలా ఎమోషన్స్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకూ సమంత నటించని పాత్ర ఇది. ఒక్కో అప్డేట్ తెలుస్తుంటే ఆ క్యారెక్టర్‌పై చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నాగార్జున సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. నాగార్జునకీ కొత్తదే ఈ క్యారెక్టర్. ఈ పాత్రని చాలా అద్భుతంగా క్రియేట్ చేశాడట డైరెక్టర్. ఓ యదార్ధ ఘటన ఆధారంగా ఈ క్యారెక్టర్ని సృష్టించారట. ఆ పాత్రలో నటించడం చాలా కష్టమనిపించిందట నాగార్జునకి. కానీ ఆ పాత్ర గురించి చెప్పగానే వెంటనే ఓకే అనేశారట నాగ్. అంటే ఆయనకి అంత బాగా నచ్చేసిందట ఈ పాత్ర. అశ్విన్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.