గాయని చిన్మయి తల్లైంది. మంగళవారం రాత్రి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భర్త, హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకొన్నారు. ``ద్రిప్త, శర్వస్ మా ఇంటికి వచ్చిన అతిథులు.. జీవితాంతం మాతోనే ఉండిపోతారు...`` అని రాసుకొచ్చారు రాహుల్.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమా హిట్టవ్వడంతో.. కొన్ని సినిమాలో హీరోగా రాణించాడు. శ్రీమంతుడు, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. చిలసౌతో దర్శకుడిగా మారి తొలి అడుగులోనే హిట్ కొట్టాడు. ఆ తరవాత నాగ్ తో మన్మథుడు 2 తీశాడు. చిన్మయి గాయనిగా పాపులర్. చాలా హిట్ గీతాలు పాడిందామె. సమంతకు గొంతు అందించి... ఆమె కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. అందుకే సమంత.. వీరిద్దరికీ ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ జంట కవలలకు జన్మనివ్వడంతో... అభిమానులు, నెటిజన్లు, చిత్రసీమ ప్రముఖులు వీళ్లకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.