మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్కంఠకి రేపు తెర లేవనుంది. అదే మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సినిమా ఫస్ట్ లుక్ రేపు విడుదల కాబోతోంది. ఆగష్టు 22 అనగా చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు అభిమాలనులకు మెగా పండగ. అందుకే ఈ పండగతో పాటు మెగా గిఫ్ట్‌ని కూడా ఇవ్వబోతున్నారు చిరంజీవి. తొలి తరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రేపు చిత్ర బృందం విడుదల చేయనుంది. అయితే ఈ లుక్‌లో చిరంజీవి ఫోటో ఉంటుందా లేదా? అనేది సస్పెన్సే. కానీ టైటిల్‌తో కూడిని లోగో అయితే రానుందని స్పష్టమైన సమాచారమ్. ఈ సినిమాకి మొదట్లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టైటిల్‌ని అనుకున్నారు. కానీ యూనివర్సల్‌గా ఈ సినిమాని విడుదల చేసే యోచనలో 'మహావీర' అనే టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రేపు విడుదల కాబోయే పోస్టర్‌లో టైటిల్ 'మహావీర'నా ఇంకేదైనా అనేది స్పష్టంగా తెలియనుంది. 150వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారనీ సమాచారమ్.