కమెడియన్ గా వేణుమాధవ్ పేరు తెలియని వారుండరు. ఆయన కామెడీని ఇష్టపడని వారూ వుండరు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వేణుమాధవ్ కి తెలుగు దేశం పార్టీతో ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే. గత ఎన్నికల్లో కోదాడ నుండి పోటీచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తాజాగా ఆయన నంధ్యాల ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ తరపున జగనే స్వయంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పై ఆయన చేసిన వాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు వేణుమాధవ్ కూడా జగన్ పై హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. జగన్ పై ఆయన చేసిన కామెంట్స్ వైసీపీ నాయకుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. ఇటీవల జగన్ ప్రసంగిస్తూ తనకు టీవీ, పేపర్ లేదంటూ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన వేణుమాధవ్ 'నంధ్యాలలో ఒక మూర్ఖుడు, బుద్ధిలేనోడు' తనకి టీవీ ఛానల్, పేపర్ లేదంటున్నాడు. మరైతే ఆ ఛానల్, న్యూస్ పేపర్ ఎవరిది బట్టేబాజ్ అంటూ కామెంట్స్ చేసాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. మొత్తంగా వేణుమాధవ్ జగన్ పై చేసిన కామెంట్స్ టీడీపీ లో జోష్ నింపగా, వైసీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతోంది.