'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాలో చిరంజీవి డబుల్ రోల్‌లో కనిపించనున్నారనే గాసిప్ సినీ వర్గాల్లో విపరీతమైన ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. చారిక్రత నేపథ్యమున్న సినిమా తీసేటప్పుడు, అందులో కమర్షియల్ యాంగిల్ కష్టం. అయితే ఎలాంటి కథనైనా కన్విన్స్ చేయగలిగేలా చెప్పడంలోనూ ఓ 'ఆర్ట్' ఉంటుంది. దర్శకుడు సురేందర్‌రెడ్డిలో ఆ 'స్పార్క్' ఉందని ఇదివరకు అతను చేసిన సినిమాలు నిరూపిస్తాయి. 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాలో చరిత్రతోపాటుగా ఇంకో పేరలల్ స్టోరీని యాడ్ చేస్తున్నారట. ఆ ప్యారలల్ స్టోరీలోనే చిరంజీవికి మరో పాత్ర క్రియేట్ చేశాడట దర్శకుడు. ఈ పాత్రకి ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారమ్. అయితే అది కన్విన్సింగ్‌గా ఉంటుందా? ఇది అసలు వాస్తవమేనా? అన్న చర్చ కూడా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' విజయవంతమయ్యాక, అభిమానులు తన కొత్త సినిమాపై పెట్టుకునే అంచనాల్నీ ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు సురేందర్‌రెడ్డిపైన కూడా ఆ బాధ్యత చాలా ఎక్కువే. అందుకనే చరిత్రకు అనుబంధంగా ఇంకో స్టోరీని క్రియేట్ చేసి, ఒరిజినల్ హిస్టరీకి ఏమాత్రం సమస్య రాకుండా చూసుకోవాలనుకుంటుండవచ్చు. మెగాస్టార్ సినిమాలో కమర్షియల్ యాంగిల్ ఉందంటే అభిమానులకు అది పండగలాంటి న్యూసే.