మెగాస్టార్ సినిమాలో ఐటెం సాంగ్‌తో మహా పాపులర్ అయిపోయింది ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్. అంతకు ముందే తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఈ పాట మాత్రం ఊపు ఊపేసింది. 'తోబా తోబా.. ' అంటూ లక్ష్మీరాయ్ వేసిన స్టెప్పులకి టాలీవుడ్ అదిరిపోయింది. ఇది మర్చిపోకుండానే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో ఛాన్స్ కొట్టేసింది. 'రత్తాలు.. రత్తాలు..' అంటూ దుమ్మ దులిపేసింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది కూడా. అందుకే చిరంజీవి నెక్స్ట్ మూవీలో కూడా ఈ అమ్మడునే ఐటెం గాళ్‌గా తీసుకోవాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా హిస్టారికల్ మూవీ. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో జాయిన్ చేస్తారా లేదా అనే సస్పెన్స్ ఉంది ఓ పక్క. కానీ ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్ ఉండనుందని జరుగుతున్న ప్రచారంతో మాస్ ఆడియన్స్ జబర్దస్త్‌గా ఖుషీీ అవుతున్నారు. ఈ సినిమాకి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరో పక్క బ్యూటీ లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లో 'జూలీ 2' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గతంలో నేహా ధూపియా ప్రధాన పాత్రలో వచ్చిన 'జూలీ' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. లక్ష్మీరాయ్ ఈ సినిమాలో సూపర్ హాట్‌గా కనిపించబోతోంది.