మెగాస్టార్ 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. ఈ చిత్రానికి టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. యూనివర్సల్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో టైటిల్ కోసం పెద్ద చర్చే జరుగుతోంది. మొదటి తరం స్వాతంత్రోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన చరిత్రని ప్రపంచానికి తెలియచెప్పాలనే ప్రయత్నంతోనే ఈ టాపిక్‌ని ఎంచుకున్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఉయ్యాలవాడ గాధ మరుగున పడిపోయిన చరిత్ర అయిపోయింది. ఆ చరిత్రని వెలికి తీసి, దృశ్య రూపం ఇవ్వబోతున్నారు మెగాస్టార్ అండ్ టీమ్. స్వాతంత్రోద్యమానికి బీజం వేసిందే ఆయన కాబట్టి. అంత గొప్ప వీరుని గాధ కాబట్టి. ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. అయితే ఈ టైటిల్‌ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సో టైటిల్ విషయంలో అభిమానుల్లో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఈ సస్పెన్స్‌ని ఆగష్టు 22న తెర పడనుంది. ఆ రోజు చిరంజీవి పుట్టినరోజు. అదే రోజు ఈ సినిమా టైటిల్‌కి సంబంధించిన టీజర్ కానీ, టైటిల్ లోగో కానీ రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.