చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు. కొన్ని అట్టర్ ఫ్లాపులూ ఉన్నాయి. జయాపజయాలు మామూలే అయినా, కొన్ని పరాజయాల్ని దిగమింగుకోవడం కష్టం. అలా చిరంజీవిని ఓ ఫ్లాప్.. బాధ పెట్టింది. కన్నీరు పెట్టించింది. వెక్కి వెక్కి ఏడ్పించేలా చేసింది. ఆ సినిమానే `వేట`. ఈ సినిమా ఫ్లాపయినప్పుడు చిరంజీవి చాలా బాధ పడ్డార్ట. ఈ విషయాన్ని `సామ్ జామ్` పోగ్రామ్లో బయటపెట్టారు చిరంజీవి.
``ఖైదీ తరవాత విడుదలైన సినిమా వేట. దానిపై చాలా ఆశలు పెట్టుకున్నాను. హిట్టవుతుందని అనుకున్నా. కానీ ఫ్లాపయ్యింది. అందుకే ఏడ్చేశా. విజేత సినిమాలో క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ సీన్లు చూసి కన్నీరు పెట్టుకున్నా. నన్ను బాగా ఏడిపించిన సినిమా `శంకరాభరణం` అని చెప్పుకొచ్చారు చిరంజీవి.