ఈ వేసవిలో బాక్సాఫీసు దగ్గర సందడి చేయడానికి రెడీ అయిపోతున్నాడు చిరంజీవి. తన ఆచార్య ఈ వేసవిలోనే విడుదల కానుంది. సమ్మర్ సీజన్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకుడదని మెగాస్టార్ భావిస్తున్నాడు. చరణ్ ఆల్రెడీ సెట్స్‌లోకి వచ్చేశాడు. చరణ్‌కి సంబంధించిన సీన్స్ అన్నీ చక చక సాగిపోతున్నాయి. ఇప్పుడు టీజర్ కీ ముహూర్తం సెట్ అయినట్టు టాక్.
ఆచార్య టీజర్ ని రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే టీజర్ కి సంబంధించిన షాట్స్ అన్నీ కట్ చేసినట్టు, మణిశర్మ ఓ బీజియమ్ కూడా రెడీ చేసినట్టు సమాచారం. ఒక నిమిషం నిడివి గల టీజర్ లో చిరు గెటప్ ని రివీల్ చేస్తూ... ఓ డైలాగ్ వదలబోతున్నాడని సమాచారం. మరి ఆ టీజర్ ఎలా వుంటుందో? ఆ డైలాగ్ ఎంత పవర్‌ఫుల్ గా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.