`ఆచార్య` షూటింగ్ ఈ అక్టోబరులోనే మొదలైపోతుందని అంతా ఆశించారు. కానీ.. అది జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ కి రావడం కష్టమని చిరు తేల్చి చెప్పేశాడట. ఈ సినిమా ఆలస్యం అయితే, ఆ ఎఫెక్ట్ తన తదుపరి చిత్రంపై పడుతుంది. అందుకే ఎలాగైనా సరే, `ఆచార్య`ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు కొరటాల. చిరు ఒప్పుకుని, షూటింగ్‌కి వస్తే... తన సమస్య తీరుతుంది. అందుకే చిరుని ఇప్పుడు ఒప్పించే ప్రయత్నాల్లో పడ్డాడని టాక్, `ఆర్.ఆర్.ఆర్` కోసం రాజమౌళి ఓ ట్రైల్ షూట్ చేశాడు. తక్కువ క్రూతో షూటింగ్ సాధ్యమేనా? అనే విషయం ట్రైల్ షూట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఎన్టీఆర్, చరణ్‌లకూ ఈ ట్రైల్ షూట్ కాస్త ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములా `ఆచార్య` కోసం వర్కవుట్ చేస్తున్నాడు కొరటాల. `ఆచార్య` కోసం ట్రైల్ షూట్ చేసి, ఆ వీడియో చిరుకి చూపించాలన్నది కొరటాల ప్రయత్నం. కరోనా నిబంధనలతో షూటింగులు చేసుకోవచ్చన్న సంగతి అర్థమ్యేలా ఈ ట్రైల్ షూట్ చేయబోతున్నాడట. అది చూసి.. చిరు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని కొరటాల భావిస్తున్నాడు. ఈవారంలోనే ట్రైల్ షూట్ ఉండబోతోందని సమాచారం.