చిరంజీవి 150వ సినిమాగా 'ఖైదీ నెంబర్ 150' విడుదలవుతోంది. మరో పక్క నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150' సినిమా కూడా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ తడాఖా చూపించడానికి వస్తున్నాయి. అయితే ఆ సందర్భంగా అటు మెగా ఫ్యాన్స్, ఇటు బాలయ్య ఫ్యాన్స్ మధ్య అనేక రకాల వివాదాలు, వాదనలు తలెత్తుతున్నాయనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. చిరంజీవి ఈ సందర్భంగా తన మనసులో మాట చెప్పి స్పందన తెలియజేశారు. బాలకృష్ణ నాకు మంచి మిత్రుడు. ఆయన 100వ సినిమాగా వస్తోన్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా మంచి విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఇదే టైంలో 'ఖైదీ' సినిమా కూడా విడుదలవుతున్నా, కానీ సినిమా పరంగా పోటీనే కానీ, మా మధ్య ఏమాత్రం విభేదాలు లేవు. స్నేహమే తప్ప అని ఆయన అన్నారు. సినిమా అనేది అందరికీ వినోదం పంచేదే కానీ, వార్ తెచ్చేది కాదు అన్నట్లుగా చిరంజీవి చెప్పిన మాటలతో ఇంతవరకూ ఫ్యాన్స్‌లో రగులుతున్న వార్‌కి బ్రేక్ పడినట్టే అని తెలుస్తోంది. 'ఖైదీ నెంబర్ 150' ఈ నెల 11వ తేదీన విడుదల కానుండగా, 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రం 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలూ భారీ అంచనాల నడుమ విడుదలవుతున్నాయి. సినీ పరిశ్రమలో అలాగే ప్రేక్షకుల్లో కూడా ఈ రెండు సినిమాల పట్లా ఆసక్తి పీక్స్‌లో ఉంది.