ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ మానియా నడుస్తోంది. దిల్ రాజ్ ఓ సందర్భంలో మాటాడుతూ థియేటర్స్ వివాదంతో హనుమాన్ మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని, మనీ ఖర్చు లేకుండా చాలా ప్రమోషన్స్ జరిగాయని అన్నారు. అన్నట్టుగా అదే జరిగింది. సంక్రాతి బరిలో దిగిన ఈ మూవీకి నైజాంలో కేవలం నాలుగంటే నాలుగు థియేటర్స్ దొరికాయి. కానీ కంటెంట్ తో హిట్ కొట్టి పలువురికి గుణపాఠం నేర్పింది. స్టార్ క్యాస్ట్, బడ్జెట్ ముఖ్యం కాదు కథ ముఖ్యమని హనుమాన్ నిరూపించింది. ఐదు రోజుల్లో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఇదే జోరుతో రెండు వందల కోట్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు ఇరవై ఐదు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. 2024లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా హనుమాన్ నిలిచింది.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో బాలకృష్ణ కోసం హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేశారు. ఈ షోకు బాలకృష్ణ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జాతో పాటు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మాయ చేశారని, సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అని బాలయ్య మెచ్చుకున్నాడు.
త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించి హనుమాన్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నట్లు, ఈ సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా వచ్చాడు. ఇప్పుడు సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ రానుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ సక్సెస్ మీట్ కి శివరాజ్‌కుమార్ గెస్ట్‌గా వస్తాడని అంటున్నారు. ఇలా పలు భాషల్లో సూపర్ స్టార్స్ సపోర్ట్ చేయటం ఈ మూవీకి ఇంకొంచెం ప్లస్ అయ్యింది.