ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. ఓల్డ్ సినిమాలు మన స్టార్స్ స్పెషల్ అకేషన్ సందర్భంగా మళ్ళీ థియేటర్స్ లో సందడి చేస్తూ, ఫాన్స్ కి ఉత్సాహాన్నిస్తున్నాయి. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మురారి రీరిలీజ్ అయ్యి 7 కోట్లు వసూల్ చేసింది. నెక్స్ట్ ఆగస్టు 22 న మెగాస్టార్ బర్త్ డే ని పురస్కరించుకుని ఇంద్ర, శంకర్ దాదా ఏంబీబీయస్ రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ డబుల్ ట్రీట్ కి రెడీగా ఉన్నారు. ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో, ఎంత మొత్తం వసూల్ చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు. చిరు కెరియర్ లో ఈ రెండు సినిమాలు చాలా ప్రత్యేకం. చిరూ ఫ్యాక్షనిస్ట్ గా నటించిన మొదటి చిత్రం 'ఇంద్ర', చంటబ్బాయి సినిమా తరవాత పూర్తి కామెడీ జోనర్ లో చేసిన మూవీ 'శంకర్ దాదా'. ఈ రెండు భారీ సక్సెస్ అందుకోవటంతో నేటి జనరేషన్ కి కూడా చిరు స్టామినా ఏంటో అర్థం అవుతుందని అనుకున్నారు అంతా. కానీ వీటన్నిటికి చిరు చెక్ పెట్టేసారు.
అవును మీరు విన్నది నిజమే చిరు స్వయంగా తన సినిమాలు రీరిలీజ్ ని అడ్డుకున్నారు. ఈ నెలలో సినిమా రిలీజ్ లు చాలా ఉన్నాయి. ఇందులో బడా స్టార్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. దీనితో కొత్త నిర్మాతలను ప్రోత్సహించేందుకు, చిన్న సినిమాల్ని ఆదుకునేందుకు చిరు తన సినిమా రీరిలీజ్ నిర్ణయాన్ని వద్దన్నారు. ఇప్పటికే పెద్ద సినిమాల కారణంగా చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకటం లేదు. పైగా స్టార్ హీరోల సినిమాల కారణంగా చిన్న సినిమా నిర్మాతలకి నష్టాలు తప్పవు ఈ లోగా ఇంద్ర రీరిలీజ్ కానుందని తెలిసి అవాక్కయారట చిన్న సినిమాల మేకర్స్.
చిరంజీవి దృష్టికి ఈ విషయం రాగా తన సినిమా కోసం చిన్న సినిమాని రిస్క్‌లోకి నెట్టొద్దని ఇంద్ర రీరిలీజ్ ని ఆపాలని నిర్మాత అశ్వనీదత్‌ను కోరారట చిరు. దీనితో ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీరిలీజ్ చేయాలన్న నిర్ణయాన్ని అశ్వనీదత్ వెనక్కి తీసుకున్నారట. శంకర్ దాదా కూడా మరి రిలీజ్ ఉండదేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ చిరు పెద్ద మనసుకి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.