అల్లుడికి మెగాస్టార్‌ ప్రశంస.!

By iQlikMovies - July 13, 2018 - 11:14 AM IST

మరిన్ని వార్తలు

మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'విజేత' లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్‌ డే టాక్‌ బాగానే అందుకుందీ సినిమా. తొలి సినిమా అయినా కళ్యాణ్‌దేవ్‌ స్క్రీన్‌పై బాగానే నటించాడు. కొన్ని చోట్ల చిన్న చిన్న తప్పులున్నప్పటికీ, ఫస్ట్‌ మూవీ కాబట్టి సరిపెట్టేసుకోవచ్చు. 

డాన్సు స్టెప్పుల్లో అక్కడక్కడా చాలా ఈజ్‌ కనబరిచాడనీ ఆడియన్స్‌ టాక్‌. రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్‌లో సాయి కొర్రపాటి నిర్మించారు. మాళవికా నాయర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కాగా అల్లుడు నటించిన ఫస్ట్‌ సినిమా కాబట్టి మెగాస్టార్‌ చిరంజీవి తొలి రోజే సినిమాని చూశారు. అల్లుడిని, చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు. 'విజేత' మంచి సినిమా అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, తండ్రీ, కొడుకుల మధ్య సాగే అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా చూడదగ్గ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా చాలా బాగుంది. మరింత విజయవంతమవ్వాలని చిత్ర యూనిట్‌కి చిరంజీవి కంగ్రాట్స్‌ తెలిపారు. 

మెగా స్టార్‌ అల్లుడు అనే బ్యాక్‌ డ్రాప్‌ నుండి వచ్చి ఫస్ట్‌ సినిమాతోనే పోజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్నాడు కళ్యాణ్‌దేవ్‌. చూడాలి మరి ముందు ముందు సినిమాకి ఎలాంటి సక్సెస్‌ టాక్‌ వస్తుందో.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS