పుష్పతో తొలిసారి... ఐటెమ్ గాళ్‌గా అవతారం ఎత్తింది సమంత. ఇన్నేళ్ల కెరీర్‌లో ఐటెమ్ సాంగ్ చేయడం సమంతకు ఇదే తొలిసారి. ఎప్పుడూ లేనిది... ఈపాటలో నటించడానికి సమంత ఎందుకు ఒప్పుకుంది? అనేది ఇప్పటికీ పెద్ద ఫజిలే. సుకుమార్ ఐటెమ్ గీతం చేయమని అడిగినప్పుడు సమంత ఒప్పుకోలేదని, తనని ఒప్పించడానికి సుకుమార్ చాలారకాలుగా ప్రయత్నించాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. చివరికి ఏదోలా సమంత ఒప్పుకుంది. అయితే సమంత ఈ నిర్ణయానికి రావడం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందట.
సమంత - ఉపాసన మంచి మిత్రులు. చరణ్ తో కూడా.. సమంత బాగా క్లోజ్ గా ఉంటుంది. రంగస్థలం సినిమా తరవాత మెగా కుటుంబంతో.. సమంత అనుబంధం పెంచుకుంది. నాగచైతన్యతో విడాకుల తరవాత సమంత పూర్తిగా డిప్రెషన్‌లో కూరుకుపోయిందని, అందులోంచి బయటకు తీసుకురావడానికి మెగా కుటుంబం కూడా తన వంతు ప్రయత్నాలు చేసిందని. పుష్పలో ఐటెమ్ గీతం ఒప్పుకునేలా చిరంజీవినే సమంతని ప్రేరేపించాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. చైతో విడిపోయాక... మెగా కుటుంబం సమంతకు చాలా రకాలుగా మానసిక ధైర్యాన్ని అందించిందట. సినిమాలతో బిజీగా ఉంటేనే కష్టకాలన్ని సులభంగా దాటేయవచ్చని చిరు ఉపదేశించాడని.. సమంత దాన్ని పాటించిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకూ నిజమో.. ఏమో..?