చిరు - బాబి... అరాచ‌కం ఆరంభం

By iQlikMovies - December 03, 2021 - 10:10 AM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి జోరు మామూలుగా లేదు. ఆచార్య ఓ వైపు న‌డుస్తుండ‌గానే, గాడ్ ఫాద‌ర్ ప‌ట్టాలెక్కించాడు. మొన్న‌నే... భోళా శంక‌ర్ మొద‌లైంది. ఇప్పుడు బాబి సినిమానీ సెట్స్ పైకి తీసుకెళ్లిపోయారు. చిరంజీవి - బాబి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. గురువారం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ కూడా ప్రారంభించేశారు. చిరు కూడా సెట్లో అడుగుపెట్టారు.

 

ఈ షెడ్యూల్ లో చిరుపై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. చిరు న‌టిస్తున్న 154వ చిత్ర‌మిది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. చిరుకి స‌న్నివేశం చెబుతూ బిజీ అయిపోయిన బాబి.. ఫొటోని క్లిక్ చేసి `అరాచ‌కం ఆరంభం` అంటూ చిత్ర‌బృందం ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో మ‌రో క‌థానాయ‌కుడికీ చోటుంద‌ని స‌మాచారం. ఆ స్థానంలో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి. వాల్తేరు వాసు అనే పేరు ఈ సినిమా కోసం ప‌రిశీల‌న‌లో ఉంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS