సిగ్నేచర్ స్టెప్పులకు పెట్టింది పేరు... చిరంజీవి. హిట్లర్‌లో అబ్బిబ్బీ... పాటకు చిరు వేసిన స్టెప్పు చూసి.. కళ్లార్పడం మర్చిపోయారు ఫ్యాన్స్. `ఇంద్ర`లో వీణ స్టెప్పు... అయితే మరో లెవల్. స్టెప్పులకు అదో ట్రెండ్ సెట్టర్ అయ్యింది.
`ఖైది నెం.150`లో కూడా చిరు వీణ స్టెప్పు వేశాడు. అప్పుడూ... ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ వీణ స్టెప్పుని రీపీట్ చేయబోతున్నారు. చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్, సిగ్నేచర్ స్టెప్పులుకు కొదవ లేదట. బాస్ పార్టీలో చిరు రెచ్చిపోయేలా స్టెప్పులు వేశాడని టాక్. `పూనకాలు లోడింగ్`లోనూ మాస్ స్టెప్పులు కనిపించబోతున్నారు. ఇంకా ఈ సినిమా నుంచి మరో రెండు గీతాలు రాబోతున్నాయి. రెండూ మాస్ గీతాలే అని తెలుస్తోంది. అందులో ఓ పాటలో... చిరు వీణ స్టెప్పు రిపీట్ చేయబోతున్నాడట. ఈ స్టెప్పు వేసిన సందర్భం.. ఆ పాట... అభిమానులకు నచ్చేలా ఉన్నాయని తెలుస్తోంది. ఆ పాట త్వరలోనే విడుదల చేయబోతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఈనెలల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.